రెడ్ ట్రీ పేరుతో కథానాయక లావణ్య త్రిపాటి ఇంట్లోనే మాస్క్ లు తయారు చేస్తోంది. ఆమె తయారుచేసిన మాస్క్లను తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది ధరిస్తున్నారు.డిజైనర్ అనితా రెడ్డి సహకారంతో ఎలాంటి లాభాపేక్ష లేకుండా వీలైనంత మందికి మాస్క్ లు అందుబాటులోకి తీసుకురావటం లక్ష్యంగా ఆమె మార్చి నుంచి ఈ పని మొదలు పెట్టారు.కరోనా తో చేస్తున్న పోరాటం లో మనకి విసుగొస్తుంది.లాక్ డౌన్ లో ఇంట్లో కూర్చోవటం కష్టంగా ఉందని మా టైలర్స్ చెప్పారు వాళ్ళకి కొనుగోలుదారులకు మేలు చేసేలా ఏదైనా ఒక పని మొదలు పెట్టాలనుకొన్నాను. ఈ మాస్క్ ల తయారీ అందరికీ ఉపయోగం అనిపించింది అంటోంది లావణ్య త్రిపాఠి.

Leave a comment