Categories
తక్షణ శక్తి కోసం ఖర్జురాల ఎనర్జీ డ్రింక్ తయారు చేసుకోండి అంటున్నారు వైద్యులు. పది,పదెహేను ఎండు ఖర్జురాల గింజలు తీసి గ్రయిండ్ చేసి పాలు,తెనె కలిపితే ఎనర్జీ డ్రింక్ తయారవుతుంది. సువాసన కోసం యాలకులు వేసుకోవచ్చు. అలాగే ఖర్జురాల సిరప్ చేసుకొంటే పిల్లలకు బ్రెడ్,సలాడ్స్ లో ఇవ్వచ్చు. పావు కిలో ఖర్జురాల గింజలు తీసి చిన్న ముక్కలు చేసుకొని వేడినీళ్ళలో నానబెట్టి మెత్తగా గుజ్జులా స్పూన్ తో కలిపి గాజు సీసాలోకి తీసుకొని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. పంచదార ఉండదు కాబట్టి ఇది పెద్దలకు కూడా మంచిదే . వేసవిలో పిల్లలకు చాలా మేలుచేస్తాయి. వీటిని నీళ్ళలో ఉడికించి వడకట్టి ఆ నీటిని పిల్లలకు తాగిస్తే దాహం తగ్గుతుంది.