Categories
ఎండ మొహం చూడకపోతే ఎన్నో అనర్దాలు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . శరీరానికి సూర్యకిరణాలు తగలటం వల్లనే సోరియాసిస్ మొటిమలు ఎగ్జిమా వంటివి రాకుండా ఉంటాయి . సూర్యకిరణాలు సహజ బూస్ట్ గా పనిచేస్తాయి . చర్మంపై పడిన సూర్యకిరణాల తోనే శరీరం విటమిన్-డి ని ఉత్పత్తి చేసుకొంటుంది . గుండె జబ్బులు, డిప్రషన్, ఆస్ట్రియో పారోసిస్ ,కొన్ని రకాల కాన్సర్ లతో పోరాడేందుకు,ఇలా శరీరం ఉత్పత్తి చేసుకొన్నా విటమిన్ -డి ఉపయోగ పడుతుంది . ఎండా తగలాలి కదా అని తీక్షణమైన ఎండలోకి వెళ్ళకుండా ఉదయం సాయంత్రం వేళల్లో శరీరానికి తగినంత సూర్యకిరణాలుసోకేలా చూసుకోవాలి .