Categories
ఎండ వత్తిడి రాపిడి వల్ల మోచేతులు ,మోకాళ్ళు నల్లగా అయిపోతాయి. ఈ నలుపు పోవాలంటే అలావూరా గుజ్జు బాగా పట్టించి ఓ అరగంట ఆరాక కడిగేసుకోవచ్చు.ఇలా చేస్తే కొద్దీ రోజుల్లో మోకాళ్ళు,మోచేతులు శరీరపు రంగులోకి మారిపోతాయి. పాలు ,పసుపు ,తేనె కలిపి ఫ్యాక్ వేసినా మంచిదే .పాలు బ్లీచ్ లాగా పని చేస్తే,తేపె చర్మానికి తేమ అందిస్తుంది.పసుపు కర్రిమిసంహారకం కనుక ఈ మూడింటి ఫ్యాక్ తో చర్మం తేటగా అయిపోతుంది. నలుపు వదలాలంటే స్క్రబ్ చేయాలి. ఆలీవ్ ఆయిల్ లో పంచదార కలిపి మోకాళ్ళు ,మోచేతులపైన సున్నితంగా స్క్రబ్ చేస్తే చాలు చర్మం మామూలుగా అయిపోతుంది. బాధం పప్పుని మెత్తగా నూరి మొహం,మెడ,నల్లబడిన మోచేతులకు పట్టిస్తే ఎండ వల్ల వచ్చిన నలుపు మాయం అవుతోంది.