ఓం కార నాడు ఎన్నో లాభాలున్నాయని పరిశోధకులు అంగీకరిస్తున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు రోజూవారీ ధ్వనానికి  విలువ ఉందని తేల్చారు. మంత్రం శక్తి ని నవీన శాస్త విజ్ఞానంగా వివరించే ప్రయత్నం చేస్తున్న సైంటిస్టులు మంత్రం అనేది రెండు సంస్కృత పదాల  సమ్మేళనమనీ మన్ అంటే మనసనీ త్రం అంటే తరంగాలు మానసిక తరంగాలు శబ్ద శక్తి ద్వారా ప్రభావితం చేయమనీ స్పష్టంగా చెప్పారు. నవీన శాస్త్రం మంత్రం అనేది ధ్వని శక్తి  రూపంగా అంగీకరించింది . ఈ పరిశోధకులు చెప్పిన విషయం. ధ్యానం యొక్క లాభాలను పూర్తీ స్థాయిలో పొందాలంటే ఆ సమయంలో చెవుల్లకు వినబడేట్లుగా ఓంకారాన్ని పలకాలనీ ఆలా పలకటం వల్ల  పోషకరాలు బయటకుపోతాయి గొంతు కండరాలు స్వరపేటిక బలపడతాయని రక్త ప్రవాహం మెరుగ్గా ఉంటుందంటున్నారు. ఈ ఓంకారాన్ని ఒకే ఫ్రీక్వెన్సీ లో ఉచ్చరించటం వల్ల  లోపలి నాడీ వ్యవస్థ లో కలిగే ఒత్తిడి వాటిలో ఒక స్థిరమైన ప్రశాంతత ఇస్తుందంటున్నారు. ఈ పద ఉచ్చారణకు  పెదవులు నాలుక ఊపిరి తిత్తులు అన్నీ కలిసి కట్టుగా పనిచేస్తాయి. నాభి నుంచి నాలుక వరకు ఒకే ధ్రువ రేఖ లో ఉన్న శక్తీ కేంద్రాలు ఉతేజితమౌతాయంటున్నారు. ఇది మతప్రచారమనో ఇదేదో మంత్రాలు  చదవటం లా కాకుండా ఒక్కసారి ‘ఓం ‘ అని పెద్దగా అని చూడండి. శరీరం లో ఏ నాడులు  కదులుతున్నాయో మనకే తెలుస్తుంది.

Leave a comment