ముదురు ఆకు పచ్చ రంగులో, ఏమాత్రం అందంగా, లేదా తినేందుకు చేదుగా వుండే కకరలో హైపోగ్లైకోమిక్ అనే పదార్ధం రక్తంలోని చక్కర స్ధాయిని అదుపులో ఉంచుతుంది. శరీరానికి అవసరం అయ్యే గ్లూకోజ్ ను అందించే శక్తి కకరలో వుంది. కాకర కాయ గింజలలో  గ్లూకోజ్ ను తగ్గించే చారన్ టిన్ అనే ఇన్సులిన్ వంటి పదార్ధం వుంది. రక్తాన్ని శుద్ధి చేసే కాకరలో బి1, బి2, బి3, సి విటమిన్ల తో పాటు మెగ్నీషియం ఫోలిక్ యాసిడ్ జింక్ ఫాస్పరస్  మాంగనీస్ ధాతువులు అధిక మోతాదులో వుండే బీటా కెరోటిన్ కాల్షియం, పొటాషియం వంటివి రెట్టింపు మోతాదులో ఉంటాయి. ఇన్ని మంచి గుణాలున్న కకరను భోజనంలో భాగంగా చేసుకోవడం మేలు కదా. ఈ మధ్య కాలంలో తక్కువ తినాలనే కాన్సెప్ట్ తో వున్నారు కనుక ఆ తినేసేది ఏదో శరీరానికి బలం ఇచ్చేదిగా ఆరోగ్యం ఇచ్చేదిగా చూసుకుంటే బావుంటుంది.

Leave a comment