Categories
ఆ వేసవికి నన్నారి, ఉరఫ్ అనంత మూల, లేదా సుగంధపాల ఒక అద్భుతమైన డ్రింక్. సన్నగా పొడవుగా పెరిగే ఈ చెట్టు వేళ్ళను కత్తిరించి వేళ్ళ మధ్యలోని గట్టి భాగాన్ని తీసివేసి ఏడెనిమిది గంటల పాటు నీళ్లలో నానబెడతారు. పావుకిలో నీళ్లకు ఒకటిన్నర లీటరు నీళ్ళు పోసి అవి ఎరుపు రంగులోకి వచ్చే వరకు ఉడికించి వడగట్టి లీటర్ కషాయానికి కిలోన్నర పంచదార కలిపి మరిగించి చల్లార్చితే నన్నారి తయారవుతుంది. ఈ సిరప్ ను గ్లాస్ నీళ్లలో ఒక స్పూన్ నిమ్మరసం కలిపి, ఒక స్పూన్ సిరప్ కలిపి చల్లగా తాగవచ్చు. నడుము నొప్పి కీళ్ల నొప్పులు మూత్రంలో మంట కు ఇది చక్కని ఔషధం కూడా.