Categories
ఎండలు నెమ్మదిగా జోరందుకుంటున్నాయి. ముందుగా వేధించేది దాహం. మంచి నీళ్లు దాహాం వేసిన వేయకపోయిన తాగవలసిందే . ఎప్పు డు నీళ్ళు తాగలనిపించక పోతే అందులో కొన్ని కాంబినేషన్స్ కలపవచ్చు . పూదినా ఆకుల టీ మంచిది. అలాగే పూదినా ఆకులు నీళ్ళలో వేసుకొన్న మంచిదే . నిమ్మ రసం ,తేనే ఏ సమయంలోనైనా మంచి పానీయం . పెరుగు ,మజ్జిగలో దొరికే పోషకాలు అనేకం. వేసవికి విరుగుడు మజ్జిగే. గసగసాలు వంటల్లో వాడాలి. కొత్తి మీర రసం, కొత్తి మీర వంటల్లో ఎక్కువగా వాడుకోవాలి. నీళ్ళలో నాన బెట్టిన సజ్జగింజలు ,నిమ్మ రసం ,ఉప్పుతో కలిపి లేదా తేనే ,చెక్కెర కలిపిన మంచిదే. ఇవన్నీ శరీరాన్ని అదుపులో ఉంచుతాయి. అలాగే ఎండ వేడి నుంచి కాపాడుతాయి కూడా.