Categories
ఆడపిల్లలు టూవీలర్స్ డ్రైవింగ్ చేస్తూ కాలుష్యం భారీన పడకుండా మొహానికి కట్టుకొనే స్కార్ఫ్ వల్ల చర్మానికి ప్రాణ వాయువు అందక అక్కడ బాక్టీరియా ఏర్పడి మొటిమలకు దారి తీస్తుందనీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.మొటిమలు తగ్గేందుకు వాడే క్రీములు ,పూత మందులలో ఉండే స్టెరాయిడ్ల కారణంగానూ కొన్ని సౌందర్య చికిత్సల్లో వాడే పరికరాల వల్ల కూడా మొటిమలు ఎక్కువవుతుంటాయి. గాఢత తక్కువ ఉన్న సబ్బుల కారణంగా చర్మం లోని నూనె గ్రంధులు మూసుకుపోతే ఇన్ ఫెక్షన్ వచ్చి మొటిమల్లా మారుతాయి. ఇలాంటి సమస్యలుండే నాణ్యమైన ఫేస్ వాష్ తో మొహాన్ని రెండుసార్లు కడుక్కోవాలని మేకప్ తప్పని సరిగా పూర్తిగా తొలగించుకోనే నిద్రించాలని నూనె శాతం ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవద్దని చెపుతున్నారు.