Categories
హైదరాబాదులో ఉన్న శ్రీ యాదగిరి నరసింహస్వామి ఆలయం దర్శనం చేయడం వల్ల సకల శుభాలకు నాంది పలికినట్టు.ఆ స్వామిని దర్శించి వద్దాం పదండి.
పాల్గుణ మాసం వచ్చేసింది ఇంకా వివాహాలతో సందడిగా వుంటాము.యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అయింది. కన్నుల పండుగగా వుంటుంది.ఉగ్రరూపుడైన నరసింహస్వామి మనలో వున్న అహంకారం తొలగించి ఙ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఉగ్ర రూపంలో ప్రత్యక్ష మై ఇక్కడ కొలువు తీరి వున్నారు.ఇక్కడ గుట్ట మీద స్వామి అంగరంగ వైభవంగా పూజలు అందుకోవడం విశేషం.
నిత్య ప్రసాదం: కొబ్బరి,బెల్లం పానకం.
-తోలేటి వెంకట శిరీష