భోజనం బదులు పళ్ళు కూరగాయ రసాలు తీసుకొంటే బరువు తగ్గుతారు అనుకోవటం కేవలం భ్రమే అంటారు ఎక్సపర్ట్స్. ఒకటి రెండు రోజుల పాటు కేవలం పళ్ళు కాయగూరల రసాలు తీసుకోవటం ఒక పద్దతిగా ఉంది. దీనివల్ల ఆ ఒకటి రెండు రోజుల మేరకు కాస్త బరువు తగ్గినా ఆ తగ్గిన బరువు వెంటనే పెరిగిపోతుంది. రెండు రోజులో అత్యంత తక్కువ కేలరీలు తీసుకోవటం వల్ల శరీరంలో గైకోజెన్,నీరు మాత్రమే తగ్గు ముఖం పడతాయి. కొవ్వు తగ్గదు. తర్వాత మాములు ఆహారం తీసుకోగానే ఆ గ్లెకోజన్,నీరు తిరిగివచ్చేస్తాయి. పళ్ళ రసాల పైన ఆధార పడితే శరీరానికి అవసరమైన ప్రోటాన్లు అందవు. ఘనాహారం లేక,జీర్ణాశయం పనితీరు కూడా సరిగ్గా ఉండదు బరువు అదుపులో ఉంచుకోవాలంటే మంచి పోషకాలున్నా ఆహారం తీసుకొంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

Leave a comment