Categories
వాడినా వాడకపోయినా ,ప్రతి వస్తువును అలా పేర్చి పెట్టేస్తూ ఉంటే బీరువాలు ఇరుకైపోతాయి . ముఖ్యంగా అమ్మయిల బీరువాలో వస్తువులు కిక్కిరిసిపోయి ,కావలిసిన వస్తువులు ఎంత వెతికినా దొరకవు . ముందుగా ఆభరణాలు పెట్టె ఒక బాక్స్ తప్పనిసరిగా వుంచుకోవాలి . విలువైన నగలన్నీ దాన్లోనే ఉంచుకోవాలి . మిగతా రాళ్ళనగలు ,ఫంకీ నగలు కాస్త మాసిపోయినా ,రంగు వెలసిన రాళ్ళు ఊడినా ఎప్పటికప్పుడు తీసేయాలి . అలాగే దుస్తులు కూడా . సరిపోవు లేదా రంగులు పోయాయా ,చాల కాలంగా వాడటం లేదా అనుకున్నవి తీసేసి అవసరం అయినా వాళ్లకి ఇచ్చేయాలి . అలాగే మేకప్ వస్తువులు కూడా ఐదారు నెలలకు మించి ఉంచకూడదు . అలాగే పాదరక్షలు కూడా ,కొత్తవి కొనగానే పాతవి తీసేస్తేనే చెప్పుల స్టాండ్ ఖాళీ అవుతుంది .