నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి ఎంత మేలు చేస్తాయని యువత పైన పరిశోధనలు నిర్వహించారు. ఎనర్జీ విటమిన్ పానీయాల్లో ఎలాంటి శక్తి లేదనీ వాటివల్ల శారీరిక మానసిక ఆరోగ్యం మెరుగుపడదనీ పరిశోధనల్లో వెల్లడైంది. ఎనర్జీ డ్రింక్ లు తాగి మిగతా పౌష్టికాహారం ఏమీ తీసుకోకుండా ఒక నెలరోజులపాటు ఉన్నా ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ఎంతో బరువు తగ్గిపోయి శరీరం శక్తిహీనమై పోవటం గమనించమన్నారు. కొద్ది రోజుల పాటు రెగ్యులర్ గా తినే ఆహారం తినకపోతేనే తేడా తెలిసిందన్నారు. వాస్తవానికి మనం తినే ఆహారంలో విటమిన్లు పోషకాలు వుంటాయని కొద్ది పాటి మార్పులు చేర్పుల వల్ల శరీరానికి ఎంతో శక్తి సమకూరుతుందని ఈ ఎనర్జీ డ్రింక్స్ వల్ల ఒక్క అణువంత కూడా లాభం లేదని తేల్చారు. విటమిన్లు మినీరల్సు నేరుగా లేదా ద్రవంగా తీసుకున్న పెద్దగా ఒరిగేదేమీలేదని వెల్లడైంది.
Categories