Categories
పిల్లలు,పెద్దలూ ఇష్టంగా తినేలా శెనగలను నానబెట్టి ఉడికించి సాయం కాలం స్నాక్స్ గా తీసుకోవచ్చు రోగనిరోధక శక్తిని పెంచుకొనేందుకు శనగలు ఉపయోగ పడతాయి. వీటిలో కాల్షియం,మెగ్నీషియం,ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. సెలీనియం అనే సూక్ష్మపోషకం తో పాటు ఫోలేట్ బీటా కెరోటిన్ విటమిన్లు కొద్ది మొత్తంలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ నిండుగా ఉంటాయి. పప్పుల్లో కొద్దిమొత్తంలో కొవ్వులుంటాయి. అవికూడా శరీరానికి మేలు చేసే ఆన్ శాచురేటెడ్ రూపంలో లభిస్తాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి. ఇవి నానబెట్టి పచ్చిగా తినటం కంటే ఉడికించి తింటే మేలు.నానబెట్టి మొలకలు వచ్చాక వేయించి తీసుకొంటే రుచిగా ఉంటాయి అయితే ఈ శెనగలు తిన్నాక నీళ్ళు తాగితేనే మంచి ఫలితం ఉంటుంది.