పప్పు దప్పళం రసం సాంబారు లోకి మంచి కాంబినేషన్ గా ఉండే అప్పడం ఎప్పటికీ తన ప్రత్యేకత పోగొట్టుకోకుండా ఇంకా కొత్త కొత్త రుచులతో వస్తోంది. తెలుగు రాష్ట్రాలలో మినపప్పు పెసరపప్పు ఇంగువ తో అద్భుతమైన అప్పడాలు తయారుచేస్తారు. పిండి పాళ్ళు అందులో వాడే సుగంధ ద్రవ్యాలను బట్టి అప్పడం రుచి ఉంటోంది. నిల్వ పచ్చళ్ళు లాగా అప్పడాలు నిల్వ చేస్తారు. ఉత్తరాదిన రాజస్థాన్ మహారాష్ట్ర తమిళనాడు కేరళ ఇటు మలయాళీలు చేసే పూరీల్లా పొంగే అప్పడాలు కన్నడల చేసే పనస పండు అప్పపీడలు ఇవ్వన్నీ పేరు పొందినవే. కాశీ లో బంగాళాదుంప అప్పడాలు చేస్తారట. ఇప్పుడైతే అప్పడాలలో రకరకాల స్నాక్స్ చేస్తున్నారు. మంటపైన కాల్చుతూ కావాల్సిన ఆకారంలో మడిచి అందులో భేల్ పురీ సేవ్ పురీ ల్లాంటివి నింపి అందిస్తున్నారు. స్ప్రింగ్స్ రోల్స్ మాదిరిగా పచ్చి అప్పడాల్లో కూరగాయ ముక్కల్ని నింపి పాపడ్ రోల్స్ చేసి ఇసున్నారు. ఇలా అప్పడంరుచి మార్చుకోకుండా ఇంకా కొత్త కథ రుచుల్ని చేర్చుకుంటూ నోరూరిస్తునే వుంది. ఈ అప్పడం నూనెలో వేయఁచే కంటే కాల్చి నెయ్యి రాసి తినటం మంచిదట.
Categories