ఇది వరకెప్పుడో నగలంటే గొలుసూ చంద్రహారం రాళ్ల గాజులూ ఇవే. వీటిని అందమైన దంతపు పెట్టెలోనో వెండి జ్యూవెలరీ బాక్స్ లోనో దాచుకుంటే సరిపోయేది. మరి ఇప్పటి సంగతి మ్యాచింగ్ పేరుతో ఎన్ని డ్రెస్ లుంటే అన్ని రకాల జ్యూవెలరీ ఫంకీ జ్యూవెలరీ ఫ్యాన్సీ వన్ గ్రాము గోల్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ బ్లాక్ మెటల్స్ పూసలు రాళ్ళూ సవా లక్ష రకాలు అసలు ఎన్ని డిజైన్లతో కొన్నారో ఇంట్లో అమ్మాయిలకే గుర్తుండదు. ఏదైనా పార్టీకి వెళ్లాలంటే ఒకటి కనిపిస్తే ఒకటి కనిపించక అన్నీ చిందర వందర చేస్తుంటారు. ఇలాంటి మ్యాచింగ్ టేస్ట్ ఉన్న అమ్మాయిల కోసం జ్యూవెలరీ ఆర్గనైజర్లు ఎన్నో రకాలున్నాయి. గోడకు తగిలించేవి టేబుల్ పైన పెట్టుకునేవి. ఇతర వేడుకల కోసం పట్టుకు పోవాలంటే వివరంగా సర్దుకోగలిగినవీ ఎన్నో రకాలున్నాయి. పెద్ద ఖరీదు కూడా ఏమీ కావు. కొంచెం స్థలంలోనే ఎన్నో నగలు తగిలించుకునేలా అందమైన బాక్సలు. ఓసారి చూడండి ఆన్ లైన్లో ఆర్డరిస్తే తెల్లారే సరికి ఇంటికొస్తాయి.
Categories