ఇప్పుడు రోడ్లన్నీ మామిడి పండ్ల రసాలతో, నిండిపోయి ఉంటాయి ఎన్నో రకాలు. ఏది కావాలి. అల్ఫోంసో అని పిలిచే మామిడి రుచులు అద్భుతం. ఇది మహారాష్ట్రాలోని రత్నగిరి ప్రాంతానిది. ఆమ్రపాలి అనే ఎరుపు రంగు పండు ఉత్తర్ ప్రదేశ్ ది. బంగిన పల్లి ఆంధ్రప్రదేశ్ సైజు, తీపిలో దీన్ని దాటే పాండే లేదు. చిన్న సైజులో వుండే చేసా ముల్సన్ ప్రాంతానిది. వాసన రుచి కలిగిన రసం పండు ఇది. టెంకె చిన్నదిగా వుండే దుస్సేహ్రీ మంచి రంగు, వాసనతో పీచు తక్కువగా వుంటుంది. పంచదార వంటి తియ్యదనంతో పలుచని పై చర్మం వున్న హిమసాగర్ బెంగాలీ మామిడి. నీలం అనే హైదరాబాద్ మామిడి. మల్లోవా అనే తమిళనాడు పండు పసుపు రంగు పీచుతో కండ బావుంటుంది. తోతాపూరి అనేది చిలక ముక్కు మామిడి ఇది ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో దొరుకుతుంది. దీన్నే చిత్తూరు మామిడిలో ప్రతేకం. ఈ రసం పండు రుచి అద్భుతం. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ సృష్టిస్తూనే ఉన్నారు.
Categories