ఎలాంటి వాతావరణంలోనైనా కంచి, నూలు చీరలు ఏ వయస్సు వారికైనా ఎప్పుడు బావుంటాయి. నిజానికి ఈ మధ్యకాలంలో చేనేతలు, పటోలా, పోచంపల్లి, ఇకత్ గద్వాల్ చీరలకు ఆదరణ పెరిగింది కూడా బావుంటుంది. అయితే అంచు లేని చీరలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ఫ్యాషన్ కూడా అంచు లేకున్నా కొంగు భారీగానే ఉంటాయి చేనేత పట్టులో కనుక బ్లవుజ్ భారీ పనితనంతో వుండాలి. ఆధునిక డిజైన్లలో క్రాప్ టాప్ తరహ బావుంటాయి. పల్చగా తేలికగా ఉండే డాకా మన్లిన్ చీరె నేత లో కొత్త అందాల్ని తెస్తుంది. పీచ్, ఐస్ బ్లూ, సీ గ్రీన్, ముత్యపు ఛాయల్లో ఈ చీరను ఎంచుకోవాలి. నేత చీరలు ఎండలకి హాయిగా ఉంటాయి. పార్టీ వేర్ గా ఎంచుకున్నా, రోజు కట్టుకున్నా ఏ వయస్సు వాళ్ళకైనా చాలా కళగా ఉంటాయి. పార్టీ వేర్ గా ఎంచుకున్నా ఏ వయస్సు వాళ్ళకైనా చాలా కళగా ఉంటాయి. అంతులేనన్ని రంగుల్లో దోరుకుతాయి కాబట్టి అందమైన రంగు ఎంచుకునే బాధ్యత అమ్మాయిలదే.
Categories