Categories
మన దేశంలో వివిద ఉద్యోగాల్లో ఉన్న మహిళల శాతం వాళ్ళ వేతనాల్లో తేడాలు పెద్దగా ఏమి పెరగలేదు అంటున్నాయి అద్యాయనాలు.ఒక నిఘా వ్యవస్థను నడిపే రంగంలో కేవలం ఒకటి నుంచి మూడు శాతం మాత్రమే మహిళలున్నారు. రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు 9 శాతం,పౌర సేవా విభాగంలో 7 శాతం అలాగే గ్రామీణ మహిళల్లో 89.5 శాతం మంది స్త్రీలు వ్యవసాయ కూలీలుగా పరిశ్రమల రంగంలో ఉన్నారు. ఏదైన సంస్థ బోర్డు సభ్యులుగా ఉన్నవాళ్ళు 7.7 శాతం మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పురుషులు అందుకునే వేతనంలో అరవై శాతం మాత్రమే మహిళలకు అందుతుంది.