Categories
వేరుసెనగ తినటం వల్ల ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడు కోవచ్చని మాస్ట్రిచ్ యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు. ప్రతి రోజు పది గ్రాముల వేరుసెనగ పప్పు ఉడకబెట్టి తినటం ద్వారా గుండె జబ్బులు, కాన్సర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చునంటున్నారు. వేరుసెనగ పప్పులోని ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్లు , ఫ్యాటీ ఆసిడ్లు శరీర ఆరోగ్యానికి సహాకరిస్తాయంటున్నారు. వీటి వల్ల అకాల మృత్యువులను తప్పించుకోవచ్చునంటున్నారు. అలాగే వేరుసెనగ నూనె, ఆవ నూనె, నెయ్యి కలిపి వంటల్లో వాడితే జీర్ణవ్యవస్థ ఎంతో బాగా ఉంటోంది. ప్రోటీన్లు ,మిటమిన్లు కలిసిన వేరుసెనగ గింజలు ఎంతో బలమైన ఆహారం .ఒక గుప్పెడు ప్రతి రోజు తినటం వల్ల శక్తి సొంతం అవుతుంది.