సాధారణంగా పిల్లలకు వచ్చే వ్యాధుల విషయంలో కుటుంబం చరిత్ర అడుగుతూ ఉంటారు డాక్టర్లు. కుటుంబంలో ఎవరైనా ఈ వ్యాధితో బాధపడ్డారా అంటుంటారు. అంటే వంశపార్యంనర్య వ్యాధి కావచ్చు నేమో అనే అనుమానంతో ఈ హిస్టరీ రకార్డు చేస్తారు.  ఒక కొత్త పరిశోధన పిల్లలు పుట్టిన నెలను బట్టి కొన్ని వ్యాధులు వస్తాయట.  జులై , అక్టోబర్ నెలలో పుట్టిన పిల్లలకు అస్తమా బాధించే అవకాశం ఉందట.  కొలంబియా యూనిర్సిటీ పరిశోధకులు కొన్ని లక్షల మందిపై చేసిన పరిశోధనపై ఈ రిజల్ట్ వచ్చింది. పిల్లల ఆరోగ్య సమస్య నిర్ధారణ గురించి చేసిన ఈ రిజల్ట్ లో పుట్టిన నెల ఆధారంతో కూడా కొన్ని వ్యాధులను నిర్ధారించవచ్చన్నారు. ఈ నెల ఆధారంతో సంవత్సరం నుంచి 17 సంవత్సరాలకు పైగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలను పరిశోధకులు గుర్తించారు.

Leave a comment