సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మోచేతుల దిగువున కొవ్వు పేరుకుంటుంది. చేతులు నాజుగ్గా ఉండాలంటే ఈ కొవ్వు కరిగించే వ్యాయామాలు చేయాలి. వ్యాయామాలతో కొవ్వు కరగటం కాకుండా భుజాల్లో ని కండరాలు కూడా బలంగా అవుతాయి. నిటారుగా నిలబడి చేతులు సమాంతరంగా చాచాలి. రెండు చేతులు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ గా తిప్పాలి. రెండు చేతులు ఒకేసారి కదిలించాలి కనీసం ఒక చెయ్యి 15 సార్లు తిప్పి చేతుల్ని కిందకు దించి స్ట్రెచ్ చేయాలి. రెండు నుంచి ఐదు కేజీల డంబుల్స్ లేపుతూ వ్యాయామాలు చేయచ్చు.

Leave a comment