Categories
ఆముదంలో మందంగా ఉన్న వత్తిని తడిపి వెలిగించి ఆ మసిని ఒక ఇత్తడి గిన్నెలో పేరుకొనేలా చేస్తారు. తరువాత ఆ మసిని ఒక పాత్రలోకి తీసుకొని ఆముదం కాస్త పచ్చ కర్పూరంతో కలిపి దాన్నీ పేస్టుగా చేస్తే అదే కాటుక. దాన్ని రాగి కాటుక కాయలో భద్రపరుచుకొంటే మంచిది .ఇది సంప్రదాయ బద్ధంగా ఇళ్ళల్లో చేసుకొనే పద్దతి. ఇది ప్రమాదం లేనిది. పచ్చ కర్పూరం వేయటం వల్ల కళ్ళకు వచ్చే సూక్ష్మ జీవ ఇన్ ఫెక్షన్ ను నిరోధిస్తాయి. కంపెనీ లో మనం కొనుక్కునే కాటుక కంటే ఇది వెయ్యింతలు శ్రేష్టం. దీని తయారీ విధానం యూట్యూబ్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి చూడవచ్చు. పెద్ద ట్రైయినింగ్ అక్కర లేదు కూడా.