ఈమె పేరు పూనమ్ శ్రోతీ . ఊరు భూపాల్. వయసు 31 సంవత్సరాలు. ఎత్తు రెండడుగుల ఎనిమిది అంగుళాలు. ఈ అమ్మాయికి ఆస్టియో జెనెసిస్ ఇంఫెర్టికా అని ఒక వ్యాధి. ఎముకలు ఫట ఫటా విరిగి పోతాయి. ఎన్నోసార్లు ఆపరేషన్లు చేసారు. ఇంతకంటే ఎత్తు పెరగదన్నారు. అప్పుడా అమ్మాయి ఏంచేసిందంటే ఫైనాన్స్ తో ఎంబీఏ చేసింది. ఒక కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగింది. తర్వాత ఉద్యోగం వదిలేసి 2014 లో దివ్యంగుల కోసం ఉద్దీప్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసింది. వాళ్ళ సాధికారత కోసం కెన్ డూ అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. వాళ్లకు తగిన శిక్షణ అవగాహనా తరగతులు తర్వాత ఉద్యోగాలు ఇప్పించటం పూనా శ్రోతి సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ సేవలకు వందమంది ప్రముఖ మహిళల్లో ఒకరుగా రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డు కూడా వచ్చింది. ఈ వార్త ఎందుకంటే ఇలాంటి అనారోగ్యం ఉన్న యువతికి జీవితం ఎంత కష్టం కానీ ఈమె ప్రముఖ వ్యక్తిగా ఎదిగింది.
Categories