ఆఫీస్ కు కుర్తీలే ఇష్టపడతారు అమ్మాయిలు అయితే రోజు ఒకే రకంగా కాకుండా కాస్త భిన్నంగా ప్రయత్నం చేయమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. కుర్తీ లెగ్గింగ్ స్టైయిల్ కి కాస్త భిన్నంగా కనిపించాలి అంటే లెగ్గింగ్స్ బదులు జెగ్గింగ్స్ ఎంచుకోవచ్చు. స్కర్ట్ లో పలోజీలు కూడా బాగానే ఉంటాయి.ఈ పలోజీలు మ్యాచింగ్ గా సైడ్ స్లిట్స్ ఉన్నా కుర్తీలు ట్రెండీగా ఉంటాయి. టాప్ పైన ఓవర్ కోట్ కూడా కొత్త ట్రెండే. పొడవాటి కుర్తీకి జోడిగా టోర్న్ జీన్స కూడా బావుంటాయి. అసలు కుర్తీలను స్ట్రెయిట్ కట్ ఫ్యాంట్లు ఎంచుకుంటే పూర్తిగా రూపం మారిపోతుంది. కొత్తగా కనిపించాలి అంటే కొత్త కొత్త ప్రయోగాలు చేయాలి.అవి శరీరాకృతినిబట్టి చక్కగా ప్రతిబింభించేలా ఉండాలి.

Leave a comment