Categories
కరోనా నేపథ్యంలో ఎన్నో కళాత్మకమైన ఫ్యాషన్ మాస్క్ లు రూపు దిద్దుకుంటున్నాయి. ఆర్గానిక్ ఇక్కత్ కాటన్, జామ్ దాని, కలనేత కలంకారి లైటింగ్ డే, రీసైకిల్డ్ మెటీరియల్స్ పోచంపల్లి వంటి ఫ్యాబ్రిక్స్ తో అందమైన మాస్క్ లకు ఫ్యాషన్ బ్రాండ్స్ శ్రీకారం చుట్టాయి అధిక పొరలతో కుట్టే కొన్ని మాస్క్ లకు ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేస్తే బ్యాక్టీరియా పోతుంది .వేప ను ఉపయోగించి చేసే నీమ్ మాస్క్ ల్లో యాంటీ ఎలర్జిటిక్ గుణాలున్నాయి. చెక్స్ జామెంట్రీ కల్ డిజైన్స్, పశ్చిమ దేశాల స్టైల్ ఆఫ్ డిజైన్స్ తో కూడిన డిజైన్ మాస్క్ లు, అరబిక్ , జ్యుయిష్ మెటెప్స్ కలగలిసిన డిజైన్ ట్రెండ్స్ కూడా వచ్చాయి. లేత రంగుల్లో ఉన్న ఎథ్నిక్ డిజైన్ మాస్క్ లు ఈ వేసవికి సౌకర్యం.