ఫలాని చోట అనే ముందు, అటూ ఉత్తరాదిన ఇటూ దక్షిణాదిన నాకైతే వేధింపులు తప్పలేదు అంటోంది అమీనా దస్తూర్. అయితే నేను వాళ్ళ పేర్లు వెల్లడించే సాహాసం మాత్రం చేయలేను. నా కేరీర్ మరుక్షణం భగ్గుమని నాశనం అయిపోతుంది.వాళ్ళంత పవర్ ఫుల్ ..ఎప్పుడో చెప్పుతానేమో చెప్పలేను. ఒక పాట షూటింగ్ లో ఒక నటుడు చాలా వేధించాడు. నా చెవిలో గుసగుసలాడేవాడు.ఆ నటుడితో కాస్త చనువుగా ఉండమని అన్నడు దర్శకుడు కూడా. సారీ చెప్పమని నిర్మాత సలహా ఇచ్చాడు. ఇక అప్పుడు తట్టుకోలేక సారీ చెప్పుకొన్నాను. ఇందులో నా తప్పు ఏముంది .రోజులు మారాయి. ఇకనైన ఇలాంటివి మానేయండి అంటోంది అమీనా దస్తర్.

Leave a comment