చాలా మంది చిన్నప్పుడు చాలా సన్నగా ఉంటారు . వయసు పెరిగే కొద్దీ బరువు పెరుగుతూ మధ్య వయస్సు దాటేకొద్దీ ఇక ఊబకాయులైపోతారు . ఎంత తక్కువ తిన్న బరువు పెరగటం ఆగదు . కానీ దానికి కారణం అధికంగా తినటం కాదు . శరీర వ్యాయామం చేయక కాదు ,వయస్సు పెరిగేకొద్దీ కొవ్వు కణాలు పనితీరు మాగిపోయి బరువు పెరుగుతున్నారు అంటున్నారు పరిశోధకులు . కొంతమందిని ఎంపిక చేసి 13 సంవత్సరాల పాటు పరీక్షించాకా వాళ్ళు బరువు పెరగటానికి కారణం కొవ్వు కరగకుండా పేరుకుపోవడమే నని గుర్తించారు . దీన్ని దృష్టిలో పెట్టుకొని వయసు కాస్త పెరిగాక బరువు తగ్గకుండా ఉంటే ఆందోళన పడకుండా చక్కని ఆహారం మితంగా తీసుకొంటూ ఎక్కువ వ్యాయామం చేస్తూ బరువు పెరగకుండా చూసుకోండి అంటున్నారు పరిశోధకులు .

Leave a comment