ఆల్కలాయిడ్లు కొద్దీ మోతాదు లో ఉండే గసగసాలు నరాలపైనా ఒత్తిడిని తగ్గించే మంచి మందులా ఉపయోగపడుతాయి. సాధారణంగా నొప్పుల్ని తగ్గిస్తాయి గనుకనే సాంప్రదాయ వైద్యంలో వాడుతారు సాధారణంగా చుస్తే తెల్ల గసగసాలు అంటే పాపి మొక్కల్లో ఎన్నో రకాలున్నాయి నీలం,ఉదా,ఎరుపు , తెలుపు రంగుల్ని బట్టి గింజలు కూడా తెలుపు,గోధుమ,నలుపు,నీలము,బూడిద వర్ణాల్లో ఉంటాయి. వీటిలోని ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. పీచు శాతం ఎక్కువ. సంవృద్ధిగా వుండే బి-కాంప్లెక్స్ ,విటమిన్లు,ఖనిజాలు,బిపిని తగ్గిస్తాయి. కొద్ది నీళ్ళలో ఈ గింజలు మార్షన్ ,పాపి వేరైనా వంటి ఆల్కలాయిడ్స్ వుంటాయి కానీ గసగసాలు ఉడికించి,వేయించి వంటలో వాడేసరికి వాటి ప్రభావం దాదాపు పోతుంది. బ్లాక్ పాపి సీడ్స్ లో వుండే విటమిన్లు,ఖనిజాలు బీపీని నిరోధిస్తాయని వైద్యులు చెపుతారు. రంగులు వేరుగా వున్నా స్వభావం మాత్రం అన్నింటిలోను ఒక్కటే.

Leave a comment