ఈ రోజుల్లో టీనేజర్లకు చదువు కెరీర్ తప్పించి శరీరానికి కష్ట శ్రమ కలిగించే పని ఏదీ లేదు. వున్న కష్ట సమయం మొబైల్ పైన, చాటింగ్ ల తోను గడిపేస్తారు వ్యాయామానికి సమయం ఇవ్వరు. అయితే ఆ వయస్సులో మరీ కఠినమైన వ్యాయామాలు అవసరం లేదు. వెయిట్ లిఫ్టింగ్ లు, హెవీ రన్నింగ్ లు అసలే వద్దు. ఎముకలు వంకర్లు పోతాయి. ఇవన్నీ 18 సంవత్సరాలు దాటాకే చేయాలి. అప్పటి వరకు శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకునే పాటి వ్యాయామాలు చాలు. ఇవి స్థూలకాయం రానివ్వకుండా చేస్తాయి. గ్రహణ శక్తి ఏకాగ్రతా పెరుగుతుంది. కండరాళ్ళు బలపడి, ఎముకలు ఏపుగా పెరిగి కావలిసిన ఎత్తు పెరిగేలా చేస్తాయి. శరీరాన్ని ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. టీనేజ్ లో కాస్తయినా శరీరాన్ని కదిలించే వ్యాయామం చేయకపొతే వచ్చే మొదటి నష్టం శరీరం బరువు పెరగడం తర్వాత ఆ పెరిగిన బరువును తగ్గించుకోవడం ఎంతో కష్టం.
Categories