ఎంతో గాఢమైన స్నేహాల్లో ఒక్కసారి డబ్బు దగ్గర చెడిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ప్రవర్తన డబ్బు అప్పు అడగటం తీసుకోవటం ఇవన్నీ కారణాలే. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఎక్సపర్ట్స్. కొత్తగా పరిచయం అయినవాళ్లు కూడా గబుక్కున పర్సనల్ విషయాలు అడిగేస్తూ వుంటారు. జీతం ఎంత ? ఈ నగ బంగారందేనా ? ఇంతకు కొన్నావు ? సొంతిల్లెనా ? ఇవన్నీ మనల్ని చిరాకు పెడతాయి ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకుండా సంభాషణ దారి మళ్లిస్తే సరిపోతుందంటూన్నారు అలాగే అందరు కలిసి ఏ హోటల్లోనే టిఫిన్ తిన్నారనుకోండి తప్పనిసరిగా మొహమాటం లేకుండా అందరం పంచుకుందాం అని చెప్పేసుకోవాలి. మొహమాటం కొద్దీ భరించి స్నేహాలు విసుగు తెచ్చేలా చేసుకోకూడదు. మన స్నేహితులే మన దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వకుండా వాళ్ళు మాత్రం అముఞ్చి దుస్తులు నగలు కొనుకున్నారనుకుందాం. అప్పుడు వెంటనే వాళ్ళ మొహం మీదే మా డబ్బు మాకివ్వకుండా ఇవన్నీ కొనుకున్నారా ? అని అడక్కూడదు అవి ఎవరో ఇచ్చిన కానుక కావచ్చు. లేదా వాళ్లే కొనుక్కుని ఉండచ్చు. నిజానిజాలు నిర్దారించుకుని ఆచితూచి మాట్లాడండి. లేకపోతే స్నేహాలు పోతాయి అంటున్నారు. టోటల్ మనీ మేక్ఓవర్ పుస్తకం రాసిన డాలీన్ . ఇవన్నీ డబ్బు వల్ల వచ్చే ఇబ్బందులు. ఇలాంటి సమయాల్లో మన వ్యక్తిత్వం బయట పడేలా ప్రవర్తించాలంటారాయన.
Categories