విచారారంగా వున్నప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా ఉండటానికి ఉపయోగ పడే ఆహారం చాలా అవసరం. తాత్కాలికంగా మానసిక ఉల్లాసాన్ని కలిగించేది తీపి పదార్ధం. దీర్ఘకాలం సంతోషంగా ఉంచేందుకు విటమిన్-డి ఎంతైనా ఉపయోగ పడుతుంది. తక్కువ ఫ్యాట్ గల పాలలో ఓట్స్ కలుపుకుని తినాలి. స్ట్రాబెర్రీస్ కూడా మంచి ఫలితం ఇసాయి. కాయి ధన్యాలలో లభించే విటమిన్-డి కూడా సంతోషం ఇచ్చేదే మనస్సు మొద్దు బారినట్లు అయిపోతే కప్పు కాఫీ చాలు. అలాగే ఆకుపచ్చని తాజా కూరగాయలు కలిపిన సలాడ్ లేదా బచ్చల కూర వేసిన శాండ విచ్ తీసుకున్నా మూడ్ బాగైపోతుంది. బంగాళా దుంపలు, బఠానీలు పుట్ట గొడుగులు వంటివి తినడం వల్ల మూడ్ బావుంటుంది. కరీం వున్న పాస్తా, కాండీబార్ వెంటనే పనిచేస్తుంది. పంచదార వెంటనే మూడ్ సారి చేస్తుంది కానీ అది హానికరం అనుకుంటాం కనుక డార్క్ చాక్లేట్ ఒక్క ముక్క తిన్నా చాలు, చిన్న కప్పు చాకొలెట్ ఐస్ క్రీమ్ అయినా సరే.

Leave a comment