ఈ రోజుల్లో చిలకడ దుంపలు అధికంగా వస్తూ ఉంటాయి . ఇవి వండటము ,తినటమూ కూడా తేలికే . ఏ వయసు వాళ్ళకైనా ఆరోగ్యమే . ఇది దుంపజాతికి చెందినది కనుక పిండి పదార్దాలు పుష్కలంగా అన్ని పోషక పదార్దాలు  మెండుగా ఉంటాయి . ఇందులో ఉండే పీచు జీర్ణక్రియ కు రక్తంలోని గ్లూకోజ్  పరిమాణాన్ని నియంత్రణలో ఉంచేందుకు గుండె జబ్బులను దూరంగా ఉంచేందుకు సాయపడుతుంది . రక్తపోటును నియతంత్రించే పొటాషియం ,కండరాలు నాడుల పనితీరును మెరుగుపరిచే మెగ్నిషియంతో పాటు పిరిడాక్టిన్ ,బీటా కెరోటిన్ వంటి రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్స్ చాలా ఉంటాయి . వీటి పై తొక్కలోనూ పోషకాలుంటాయి .

Leave a comment