సెలబ్రెటీ అయిపోయాక న జీవితం 180 డిగ్రీలు తిరిగింది . పూర్తిగా తల కిందులైంది అంటోంది తాప్సి . నేను ఢిల్లీ లో పుట్టాను స్నేహితులు బంధువులతో కలసి బయట తిరగటం ఎంతో ఇబ్బంది . నా వరకే కాదు ,చివరకు మా ఇంట్లోవాళ్ళకూ ఇబ్బందే, అభిమానులు చుట్టుముట్టేస్తారు . షూటింగ్ లేనప్పుడు,సాధారణ జీవితం గడపాలని ఉంటుంది . మాల్స్ లో అభిమానుల తాకిడి . ఇక విదేశాల్లో షాపింగ్ చేయాల్సిందే . నాకు ఇండియన్ దుస్తులంటే చాలా ఇష్టం నా వయసు కి హాయిగా విండో షాపింగ్ చేస్తూ,అన్ని షాపులు వెతికేస్తూ నాకు కావలసినవి కొనుక్కోవాల నిపిస్తుంది కానీ అంత వ్యక్తిగత జీవితం మిగల్లేదు . ప్రజల అభిమానం నేను అర్ధం చేసుకోగలను గానీ నా కంటూ నా వ్యక్తిగత జీవితంజీవితం పోయింది  అంటోంది తాప్సి. నిజమే కదా బయట షాపుల్లో అలా కనబడితే అభిమానులు నిలబడనిస్తారా ?

Leave a comment