Categories
బంగారంతో చేసిన నగల్లో అందమైన చిన్న రాళ్ళు పొదిగి చక్కని హారాలుగా ధరించడం చెప్పాలంటే ఒకప్పటి ఫ్యాషనే కానీ ఇప్పుడీ నగలు సంత రాళ్ళకు కాలం చెప్పింది. పెద్ద పెద్ద రాళ్ళతో చేసిన స్టేట్ మెంట్ నగలోస్తున్నాయి. గుండ్రంగా, కోలగా ఉండేవే కాదు చతురాస్త్రం, దీర్ఘ చతురస్త్రం ఆకారంలో చక్కని అందమైన రాళ్ళూ పొదిగిన స్టేట్ మెంట్ నగలు ఇవ్వాల్టి ఫ్యాషన్. ఇవి ముదురు రంగు రాళ్ళయితే మరీ అందం రెండు మూడు కలిపి వేసుకునే అవసరం లేనే లేదు. మంచి మోడ్రన్ డ్రెస్ కి మాచింగ్ గా ఆ స్టేట్ మెంట్ నగలు గనుక వేసుకుంటే అందమే అందం.