Categories
నిద్ర పోయేందుకు కనీసం మూడు గంటల ముందు రాత్రి భోజనం ముగించమంటున్నారు ఎక్స్పర్ట్స్.ఇలా ముందే ఆహారం తీసుకోవటం వల్ల రాత్రివేళ ఆకలి కావచ్చు పడుకునే ముందర పండ్లు, గ్లాస్ పాలు తీసుకోవడం కూడా మంచిదే పాలు,పెరుగు, మజ్జిగ, జామ, బొప్పాయి, అనాస, కీవీ ల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది.ఇది శరీరంలో సెరటోనిన్ ,మెలటోనిన్ నయసీనమైడ్ మొదలైన వివిధ రకాల రసాయనాల లాగా రూపాంతరం చెందుతోంది ఇందులోని సెరటోనిన్ అందోళన నియంత్రణకు,మెలటోనిన్ చక్కని నిద్రకు ఉపయోగపడతాయి. కనుక నిద్రపోయే ముందర, కప్పు పాలు లేదా ఒక కప్పు పండ్లు తినడం మంచిదే.వట్టి పాలే కాకుండా పండ్లతో పాటు ఆక్రోట్ ,బాదం, పిస్తా గింజలు కూడా ఐదారుకు మించకుండా నిద్రపోయే ముందర తినటం మంచిదే.