రొమ్ము కాన్సర్ బాధితుల కోసం కుత్రిమ రొమ్ముని మాస్టక్టమీ బ్రాసరీలను రూపొందిస్తోంది హరియాణా లోని ఫరీదాబాద్ కు చెందిన ఆకృతి గుప్తా. ఆమె తండ్రి అరుణ్ కాన్సర్ ను జయించారు. ఆ అనుభవం తో  ఆకృతి కాన్సర్ బాధిత మహిళల కోసం ఏదైనా చేయాలనుకొంది. ‘ కెన్ ఫెమ్ ‘ సంస్థని స్థాపించి ఈ ఉత్పత్తిని ఉత్పత్తిని మార్కెట్ లోకి తీసుకొచ్చింది. కాటన్ తో చేయటం వల్ల ఈ బ్రాలతో అలర్జీలు రావు అంటోంది ఆకృతి అంకుర సంస్థల విభాగం లో విద్యార్థులకు నిర్వహించే అంతర్జాతీయ పోటీ గ్లోబల్ స్టూడెంట్స్ ఆంట్ర ప్రెన్సూర్ అవార్డ్ 2020 లో భారత నుంచి ప్రధమ స్థానంలో నిలిచింది ఆకృతి. ఇప్పుడు పిజీ చేస్తూనే వ్యాపారం కూడా నిర్వహిస్తుంది ఆకృతి గుప్తా.

Leave a comment