న్యూయార్క్ థియేటర్ ఆర్ట్స్ లో షేక్స్పియర్  నాటకాల్లో ఎక్కువ నటించాను ఇండియాకు వచ్చే ముందర చేసిన ఇ ఈ నాటకం నాకు ఎంతో గుర్తింపు తెచ్చింది. ప్రపంచంలోని ఏడు దేశాల్లోని ఏడుగురు మహిళల గాధలను ఈ నాటకం లో చూపించారు అందులో 27 ఏళ్ల ముక్తార్ మై అనే పాకిస్తాన్ మహిళ పాత్ర పోషించాను బలీయమైన పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఈ మహిళ నిలదొక్కుకుని ఓ పాఠశాల స్థాపించి ఆదర్శంగా నిలుస్తుంది. ఆ ముక్తార్  మై పాత్రనన్ను ఎంతో ఆకట్టుకుంది అంటుంది ప్రగతి యాదాటి షేక్స్పియర్ నాటకాల తో రంగస్థలం పైన తన ప్రత్యేకత నిరూపించుకున్న ప్రగతి రచయిత్రి తెలంగాణ యాసలో ఫోటో పేరుతో నవల రాశారు.  ఆర్టిస్ట్ గా రాణించాలనే కోరికతో తెలుగులో స్క్రీన్ ప్లే మూవీ చేసింది సీనియర్ జర్నలిస్ట్ యాదాటి కాశీపతి కూతురు ప్రగతి.

Leave a comment