లావెండర్ రోజ్ వంటి ఎన్నో రకాల లో లభించే బాత్ సాల్ట్ చర్మ సంరక్షణ కు ఎంతగానో ఉపయోగపడుతోంది. గోరువెచ్చని నీళ్ళలో రెండు టేబుల్ స్పూన్ బాత్ సాల్ట్ వేసి నీళ్లలో పాదాలను ఓ పావుగంట సేపు ఉంచితే, రక్తప్రసరణ మెరుగై అలిసిన పాదాలకు సాంతన లభిస్తుంది. స్నానం చేసే నీళ్లల్లో కాస్త బాత్ సాల్ట్ కలపటం వల్ల ఆ ఉప్పు లో ఉండే ఖనిజాలు చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. పింక్ సాల్ట్ రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. లావెండర్ ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మ రక్షణకు మేలు చేసే ఈ సాల్ట్ ని వాడుకోవటం మంచిది.

Leave a comment