Categories
పోషక విలువలు సమృద్ధిగా ఉండే వాల్ నట్స్ ఎన్నో రోగాలను నియంత్రిస్తాయి.మధుమేహం నియంత్రణలో ఉంచడంతో పాటు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.వీటిని నానబెట్టి నిద్రపోయే ముందు భోజనంలో తింటే వాటిల్లోని మెలటోనిన్ హార్మోన్ క్రమపద్ధతిలో వచ్చేలా చేస్తుంది.వాల్ నట్స్ లో విటమిన్లు ప్రోటీన్లు, ఫ్యాటి ఆమ్లాలు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఎన్నో పోషకాలు లభ్యం అవుతాయి.30 గ్రాముల వాల్ నట్స్ లో 190 క్యాలరీలు లభిస్తాయి.అందుకే దీన్ని పవర్ ఫుడ్ అంటున్నారు.ప్రతిరోజు తింటే ఆస్త్రీయో పోరాసిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.