వర్షాకాలంలో హెయిర్ యాక్ససరీస్ ప్రత్యేకంగా వుంటే బావుండననిపిస్తుంది. కలర్ ఫుల్ క్లాత్ హెయిర్ బాండ్స్, డేకోరేటివ్, ఆర్నమెంటల్ హెయిర్ క్లిప్పులు సాయంత్రం వేలకు బాగా సుటవ్వుతాయి. జుట్టు రేగినా, ఈ రకం క్లిప్పులు ఆ లిపాన్ని మరుగున పడేసి ఆకర్షణగా ఉంటాయి. హెయిర్ కలర్ గురించి పెద్దగా ఆలోచించ నక్కర్లేకుండా నచ్చింది వాడేసుకోవచ్చు. హెయిర్ ఎక్స్ టెన్షన్స్ కుడా పెట్టుకోవచ్చు. అయితే ఈ హెయిర్ బ్రాండ్స్, క్లిప్పులు వ్యక్తిగత స్టయిల్ వయస్సు ధరించే డ్రెస్సు అనుసరించి ఎంచుకోవాలి. అయితే శిరోజాల రక్షణ కోసం మాత్రం యాంటీ ఫ్రిజ్ హ్యుమిడిటీ ప్రొటెక్టివ్ జెల్స్  , హెయిర్ స్మూతినింగ్ బామ్స్ తప్పనిసరిగా వాడాలి. ఈ కాలంలో జుట్టు పొడి బారకుండా జాగ్రత్త తీసుకోవాలి.

Leave a comment