మనకు తెలిసింది తియ్యని మామిడి తాండ్రి. ఏ పోర పొరగా వుఉడు వస్తూ ఎంతో బాగుంటుంది. ఇక ఆ రోజులు పోయినట్లే. అన్ని రకాల పండ్ల తోనూ ఫ్రూట్ లేదర్స్ వచ్చేస్తున్నాయి.చాపలా చుట్టి నట్లు వచ్చే ఈ తాండ్రని పండ్ల చాపలు అని పిలవచ్చు. అంజీర్, ఆపిల్, అరటి, పనస, నిమ్మ, కమలా, దానిమ్మ, పైనాపిల్, సపోటా అన్నీరకాల ఫ్రూట్ లెదర్స్ వచ్చాయి. ఇంకా కొత్త ఫ్లేవర్స్ కోసం పండ్ల గుజ్జు తో , వెనిలా, అల్లం, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా అన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి సలాడ్ డ్రయిర్ల పైన ఆరబెట్టి ఇలాంటి దుమ్ము, ధూళి పదనివ్వకుండా ఇందులో ఉండే ఖనిజాలు విటమిన్లు పోకుండా పండ్లలోని అన్ని సుగుణాలు ఉండేలా ఈ పండ్ల తాండ్రను సృష్టిస్తున్నారు. కొన్ని పండ్ల, ఉదాహరణకు మామిడి, వంటి అన్ని కాలాల లోను పాండవు కనుక ఆయా ఋతువుల్లో కాసే పండ్ల తో ఈ పండ్ల చాపలు తాయారు చేయడం మంచి ఆలోచన కదా. స్వదేశి పండ్లతో పాటు విదేశీ పండ్లు చప్పరించడమే.
Categories