Categories
బ్లాక్ థ్రెడ్ యాంక్లెట్ దాన్నే ఈవిల్ ఐ యాంక్లెట్ అని పిలిచే నల్లతాడు ఇవ్వాళ యూత్ ఫ్యాషన్. అమ్మాయిలు ఒక్క కాలుకు లేదా రెండు కాళ్ళకి ఈ నల్ల తాడు కట్టేస్తున్నారు. పూర్వకాలంలో పిల్లలకు దిష్టి తగలకుండా మెడలోను చేతికో ఒక నల్ల తాడు కట్టే ఆచారం ఉండేది. ఆ నల్ల తాడుకు నల్లపూసలు బంగారు గుండు గుచ్చేవాళ్ళు ఈ దిష్టి తాళ్లనే ఇప్పుడు రకరకాల డిజైన్లతో అమ్మాయిలు వాడుతున్నారు. బ్రాస్ లెట్ మాదిరిగా కూడా పెట్టుకుంటున్నారు ఇవెంతా అందంగా ఉన్నాయంటే బంగారం వెండి కలిపి చిన్న లాకెట్ లుగా ఈ నల్ల తాడుతో కలిపి అందంగా కూర్చుతున్నారు ఇవి కాస్తా ఫ్యాషన్ ట్రెండ్ అయ్యాయి.