ఇటీవలే 106వ పుట్టిన రోజు చేసుకున్న మస్తానమ్మ యూట్యూబ్ ఛానల్ సెలబ్రిటీ. కృష్ణా జిల్లా గుడివాడ కు చెందిన మస్తానమ్మ తన వంటలతో దేశవిదేశీయులను కట్టి పడేస్తూ తన ప్రత్యేక లోకాన్ని సృష్టించుకుంది. యూట్యూబ్ లో వంటల చానల్స్ ఎన్నో ఉన్నా అందులో ఎంతో మంది బామ్మలున్నా అందులో మస్తానమ్మే వయసులో అందరి కంటే పెద్దది. యూ ట్యూబ్ నడిపించే ఎలర్ట్స్ ని చూస్తుంటే ప్రపంచంలోనే అత్యధిక వయస్సు గల యూట్యుబర్ ఆమే. కంటి చూపు సరిగ్గా లేకపోయినా వంట మాత్రం అధ్బుతం. వెజ్, నాన్ వెజ్ వంటకాలను మన పల్లెటూర్లలో ఎలా సహజంగా వండుతారో అలా చేసి చూపించడం ఆమె ప్రత్యేకత. అల్లం, వెల్లుల్లి వంటివి గోటితోనే వలిచేసే ఈమె ఛానల్ కంట్రీ ఫుడ్స్ కు ఇప్పటి వరకు రెండు లక్షల యాభై వేల మంది చందా దారులు ఉన్నారు. ఇటీవలే తన 106వ పుట్టిన రోజు చేసుకుంటే నలుమూలల నుంచి బహుమతులు వెల్లువలా వచ్చిపడ్డాయట.

Leave a comment