Categories
సహజమైన పోషక విలువలు పోకుండా ఆహారంలో మార్పులు తెచ్చి పరిమాణాన్ని ఏమీ తగ్గించకుండా తిని వ్యాయామం యోగ తోనే శారీరకంగా మానసికంగా ఫిట్ గా తయారయ్యాను అంటుంది స్మృతి ఇరాని. బుల్లితెరపై పేరు తెచ్చుకుని రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ 45 ఏళ్లకే బరువు బాగా పెరిగింది. ఇటీవల బరువు తగ్గి నాజూకుగా అయిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఒకవేళ ఆపరేషన్ల ద్వారా తగ్గారా అని ప్రశ్నలు వేశారు వాటికి సమాధానం ఇస్తూ లేదు శరీరానికి కావలసిన విటమిన్లు ఖనిజాలు ఉండేలా గింజ ధాన్యాలు గ్లూటెన్, చక్కెర లేని పదార్థాలు పాల ఉత్పత్తులు తీసుకుని వ్యాయామంతోనే బరువు తగ్గించుకున్నానంటుంది స్మృతి ఇరాని.