Categories

ఒక పదేళ్ల కాలంలో భూమి ఎక్కువగా వేడెక్కిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా వేడి ఎక్కడం వల్లనే తీవ్రమైన తుఫాన్ లు, వరదలు కరువు దావానలం మొదలైనవి చోటుచేసుకుంటున్నాయి.ఈ వేగవంతమైన మార్పులు మనుషులకే కాదు ఇతర ప్రాణులకు కూడా ముప్పే. నీటిలో ఉండే జీవులు చల్లని ఎత్తయిన ప్రాంతాలకు తరలిపోతున్నాయి. వీటి సీజనల్ ప్రవర్తన సాంప్రదాయ వలస పద్ధతులు మారుతున్నాయి. వాతావరణంలో మార్పులు కాలుష్యం అడవులు నరికివేతలు చేపలు పక్షులు క్షీరదాలు ఉభయదారులు కూడా 114 రేట్ల వేగంగా అంతరిస్తున్నాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి. మానవ కార్యకలాపాల్లోనే తీవ్రమైన మార్పులు రావాలని చుట్టూ వాతావరణం కలుషితం చేసే రసాయనాల వినియోగం తగ్గించుకోవాలని చెబుతున్నారు నిపుణులు.