ఎన్నో వంటకాలకు ఉల్లికాడలు రుచి ఇస్తాయి. ఈ కాడల్ని చిన్న ముక్కలుగా తరిగి బాగా ఆరనిచ్చి ఖాళీ నీళ్ల బాటిల్లో పోసి ఫ్రిజ్ లో పెడితే పాడవకుండా ఉంటాయి. తడిచేయి తగలకుండా ఈ కాడల్ని కూరల్లో చల్లుకోవచ్చు. అలాగే వీటిని ఫ్రిజ్ లో ఉంచే ముందర పేపర్ టవల్ లేదా కాటన్ క్లాత్ లో చుట్టి పెడితే తాజాగా ఉంటాయి. ఉల్లికాడలు పచ్చని భాగం వరకు కట్ చేసుకొని కింద వేర్లతో సహా ఉండే తెల్లని భాగాన్ని ఒక గ్లాస్ నీళ్లలో లేదా కుండీలో పెట్టి ఎండ సోకే కిటికీ లో ఉంచాలి వరం రోజుల్లో మళ్ళీ కాడలు పెరుగుతాయి. వీటిని వంటల్లో వాడుకోవచ్చు.

Leave a comment