ఫ్యాషన్ ప్రపంచం మొత్తం ఇప్పుడూ ప్రకృతి ఆరాధనలో మునిగిపోయినట్లు ఉంది. ఫ్యాషన్ డిజైనర్ మధురిమా సింగ్ డ్రెస్ డిజైన్ చేసిన ఫ్యాబ్రిక్ ను చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. అరటి, మొక్కజొన్న, సోయా పాలు తామర, ఆరెంజ్ బాంబు యూకలిప్ట్ స్ వంటి సహజ ఫైబర్ లతో పర్యావరణ అనుకూలమైన ఫ్యాబ్రిక్‌ను తయారు చేసింది మాధురిమా సింగ్. ముంబైకి చెందిన ఈ ఫ్యాషన్ డిజైనర్ ఢిల్లీలో ‘ధురీ’ పేరుతో ఫ్యాషన్ లేబుల్ ద్వారా సహజ ఫైబర్ తో చేసిన ఫ్యాబ్రిక్ తో వస్త్రాలను అందిస్తోంది. డిగ్రీ చేసిన మధురిమ ఎక్స్పోర్ట్ కంపెనీలతో పాటు ప్రముఖ డిజైనర్స్ తో కలిసి ఈ సరికొత్త పర్యావరణహితమైనా ఫ్యాషన్ దుస్తులకు శ్రీకారం చుట్టింది. దేశాయి చేనేతలకు సేంద్రీయ రంగులతో అందాన్ని తీసుకొచ్చారు కూరగాయలు పూలు పండ్లు విత్తనాలు మొదలైనవాటితో రంగులు తీసిన కాటన్ ఫ్యాబ్రిక్ కు అందమైన డిజైన్ లు వేస్తోంది మధురిమ. సాంప్రదాయ పద్ధతుల్లో కళ్లకు చర్మానికి హాని చేయని ఈ సహజ ఫైబర్ దుస్తులు ఆమెకు మంచి మార్కెట్ ను తెచ్చిపెట్టాయి. ఈ పూర్తి సేంద్రియ దుస్తులు సెలబ్రెటీలు మనస్ఫూర్తిగా మెచ్చుకుని ధరిస్తున్నారు. ప్లాస్టిక్ వృధ ను అరికట్టేందుకు గాను ఈ భూమిలో కలిసిపోయే ఫ్యాబ్రిక్ తయారుచేసిన మధురీమా సింగ్ అభినందనీయురాలు !
Categories