ముక్కును సంపంగి తో పోలుస్తారు . సన్నని పొడవైన నాసిక ముఖానికి అందం ఇస్తుంది అంటారు . కవులు ముక్కుపై కవితలు ,పద్యాలు రాశారు . పూర్వపు రోజుల్లో ముక్కు పుడక ఒక ఆచారం లాగే ఉండేది . ముక్కుపుడక ని ఆరోగ్యాన్ని కాపాడే వస్తువుగా అనుకొనేవాళ్ళు . ఎడమవైపు శ్వాసకు చంద్రస్వరం ,అని కుడివైపు శ్వాసను సూర్యస్వరం అని అనీ అంటారు . అంచేత ఎడమవైపు అర్ధచంద్రాకారంలో ముక్కు పుడక ని  కుడివైపు ఒంటి రాయి  ముక్కు పుడక ను ధరించాలి అనుకునేవాళ్ళకు శ్వాస సంబంధమైన సమస్యలు కూడా రావటారు . కానీ అందమైన ముక్కుకు మెరిసే బుల్లి వజ్రపు  ముక్కు పుడక మాత్రం అంతులేని అందం ఇచ్చే మాట వాస్తవం . పైగా ఇప్పుడు  ముక్కు పుడక ఫ్యాషన్ స్టేట్ మెంట్ కూడా .

Leave a comment