ఏ బ్యూటీ క్లినిక్ లో ఓ గంట సేపు కూర్చొని ప్యేషియల్ చేయించుకునే తీరుబడి లేకపోతే ఇంట్లో ముల్తానీ మట్టి పాక్ వేసుకోండి . మొహం దివ్యంగా వెలిగి పోతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ముల్తానీ మట్టి ఓట్స్ పొడి . బాదంపప్పు పొడి ,గులాబీ రేకలపొడి నాలుగు చుక్కలు ఎసెషియల్ ఆయిల్ కలిపి ఓ సీసాలు భద్రపరిచి ,వారానికి నాలుగు సార్లు ఈ మిశ్రమం లో పెరుగు కలుపుకొని ఫ్యాక్ వేసుకొంటే ముఖం కాంతివంతం గా కనిపిస్తుంది . ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి అమిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకొంటే ముఖంలో జిడ్డు పోయి చర్మం తాజాగా అయిపోతుంది . గంధంపొడి ,శనగపిండి,ముల్తానీ మట్టికలిపి ఇందులో బాదంపప్పుపొడి ,గులాబీ రేకుల పొడి ,పచ్చిపాలు కలిపి జారుగా కలిపి పేస్ ప్యాక్ వేసుకొంటే చర్మం మెరుపు వస్తుంది .

Leave a comment